Sunday, March 15, 2009

అమ్మమ్మ జీవితం


పిన్న వయస్సులో ఎనలేని బాధ్యతలు మోసి,
అందరికీ అండగా నిలిచి,
కురిపిస్తుంది ప్రేమ వాన,
అమ్మాన్నాన్నల ముద్దుల కూన.

తల్లిదండ్రుల సుశ్రూష చేస్తూ,
అక్కల శ్రేయస్సు కోరుతూ.
పిల్లల మంచి చెడ్డలు చూస్తూ,
వారిని ప్రయోజకులను చేస్తూ.
కుతురిని,కోడళ్ళను సమానంగా చూస్తూ,
వారికి అండగా నిలుస్తూ.
మనుమలకు ప్రేమ వాత్సల్యం పంచుతూ,
కరుగుతున్న కొవ్వోత్తిలా అందరికీ వెలుగునిస్తూ.
ఎనలేని కష్టాలకు ఎదురీదుతూ,
ఒక్కతే అందరి జీవననావను నడుపుతూ.
చేరుకుంది ఒడ్డుకి,ఆనందాల గట్టుకి.

తుఫానొకటి చెలరేగింది,
తిరిగి తనను నౌకలోకి చేర్చింది.
భగవంతుడే సారథిగా,
తాను ఒంటరి బాటసారిగా,
చేస్తుంది పయణం,
అందరికీ చేస్తుంది తనకు మించిన సహాయం.

కొద్దిపాటి ఆదరణకే ధారపోస్తుంది జీవితం,
ప్రేమకై పరితపిస్తుంది అనునిత్యం.
ఇదే మా అమ్మమ్మ జీవితం,
సుఖదుఃఖాల సమ్మేళనం.
ఆందరికీ తన జీవితం ఆదర్శప్రాయం.

No comments:

Post a Comment