Thursday, May 5, 2011

నా పాప రాకకై ...............ఎదురు చూస్తూ..........


నువ్వు వస్తావని నా జీవితాన్ని మారుస్తావని
నాలో నూతన శక్తి నీతో మొదలవుతుందని
నీ నవ్వే నాకు ప్రపంచాన్ని జయించిన భావన కలిగిస్తుందని
నీ బుడి బుడి అడుగులు నా జీవన బాట నిర్మిస్తాయని
నా ప్రపంచాన్ని అందంగా ,ఆనందాల బృందావనంగా మారుస్తుందని
ఆశగా ఎదురు చూస్తున్నా నీ రాకకై .........
నాలో పెరుగుతున్న అమ్మనై........ నా పసిపాపకై..........

Wednesday, July 22, 2009

విరహవేదనలో నీ కోసం


ప్రియతమా! నా మది అనుక్షణం

నీ ప్రేమకై పరితపిస్తున్నా

దయ కలుగదా ??????????

నా ప్రేమ మాటల్లో చెప్పాలా?

నా మనస్సు ,నా కళ్ళతో పలుకదా ?

లేక, నీకు వినిపించదా?


ఆశగా ఎదురు చూస్తున్నా

నీ యెదపై వాలాలని.

క్షణాలు యుగాలు కాగా,

నీ ప్రేమ నాలో సుడిగాలి రేపగా

ఆగలేకున్నా .

రావా, నీ కోసం వేచిచూస్తున్నా....
Wednesday, May 27, 2009

అంకితం

నీ చిలిపి నవ్వుతో ప్రియతమా!!!!!!!
నా మదిని దోచావు.
నీ ప్రేమ పరిమళంలో,
అంతా మయమరచి పొయాను.
నీవు చేసే లాలన,
నాలోని పసితనం గుర్తు చేయగా.....
నీ కౌగిళిలోని వెచ్చదనం,
నీ హృదయ సామ్రాజ్యాన్ని
ఏలుతున్నాననే గర్వం పెంచగా.....
నా ప్రేమే లోకంగా,
నా ఆనందమే సర్వస్వంగా,
ఆనంద శిఖరాలను అధిరోహిస్తూ.....
ఓ నా హృదయమా!!!!!!!!
"హేమంత"పు ఆనందమా!!
అంకితం నీకే నా"హరిహృదయం".

Saturday, March 28, 2009

రా!!! వేచిచూస్తుంది ఈ లోకం.


పంజరంలో చిలుకా! లేదా నీకు వేరే ప్రపంచం?
కనిపిస్తున్నది కాదు సర్వస్వం.
ఇనుప గోడలను తెంచుకు వస్తే,
అందమైన ఈ లోకం చూస్తే,
తెలుస్తుంది నీకు వ్యత్యాసం.
స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందం.

బంగారు పంజరమైనా?
ఏముంది గొప్పతనం?
లోకంలోని వింతలలో ఉంది విశేషం.
రంగురంగుల పువ్వుల్లో,
పక్షుల కిలకిల రాగాలలో,
గలగలా పారుతున్న సెలయర్లలో.....

వింతలు చూపే ఈ ప్రపంచం,
ఎవరికోసం?
వేచి చూస్తుంది నీ కోసం....

నా కుటుంబం


పెళ్ళి తరువాత జీవితం బహు విచిత్రం!!
మునుపటి బంధం అవుతుంది దూరం.
తెలియని జనం అవుతారు స్వ జనం.

కాని రక్తసంభంధం ఎప్పటికీ ఒక వరం!!
మన కష్టం,నష్టం,సుఖం,సంతోషం,
వారిని చేస్తుంది ప్రభావితం.

నాన్న తన కష్టాన్ని పోగుచేసి,
అమ్మ తన జీవితాన్ని ధారపోసి,
ప్రసాదించారు నాకు జీవితం.
అక్కా,అన్నా పంచారు వారి ప్రేమ అమితం.

నా కుటుంబం ఎప్పటికీ నాకు కొండంత బలం.

Wednesday, March 25, 2009

రీసిషనా... మజాకా...


రేపంటే భయం ఈ రోజు కొంచెం నయం.
పని భారం ఎల్లప్పుడు గరం గరం.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ఒక వరం.
ఒకప్పుడు దానిని వదిలినవారు చేశారేమో నేరం?

నిద్రలు లేవు,పనితో బేరాలు లేవు.
చెయ్యు...అనటమే ఆలస్యం....
బరిలో దూకేయటం.

కష్టపడితేనే జీతం.
సత్తా చూపిస్తేనే ఉద్యోగం.
జీతం,ఉద్యోగమే అయ్యింది జీవితం.
నేటి యువతకు లేదు వేరే ప్రపంచం.
ఇలా ఇంకా ఎంత కాలం??????

Monday, March 23, 2009

ఎవరీ భగవంతుడు????????

చాలా కాలం గమనించా..
భగవంతుడు ఉన్నడా అని అన్వేషించా..
అనుకున్నది ఒకటి
జనులనుండి విన్నవి కోటి.

భక్తి ముసుగులో జరుగుతుంది వ్యాపారం.
దేవుడిని నిజంగా చూశారా జనం?
అయినా ఉన్నాడనే నమ్మకం అపారం.
ఎందుకు వాడిపై అందరికీ మమకారం?
అని ఆలోచిస్తే తెలిసిందొక విషయం!!!!

భగవంతుడనేది ఒక "నమ్మకం".
భాధల సుడిగాలిలో ఒక వరం
అందుకే పెరుగుతుందేమో మన మనోబలం