Saturday, March 28, 2009

రా!!! వేచిచూస్తుంది ఈ లోకం.


పంజరంలో చిలుకా! లేదా నీకు వేరే ప్రపంచం?
కనిపిస్తున్నది కాదు సర్వస్వం.
ఇనుప గోడలను తెంచుకు వస్తే,
అందమైన ఈ లోకం చూస్తే,
తెలుస్తుంది నీకు వ్యత్యాసం.
స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందం.

బంగారు పంజరమైనా?
ఏముంది గొప్పతనం?
లోకంలోని వింతలలో ఉంది విశేషం.
రంగురంగుల పువ్వుల్లో,
పక్షుల కిలకిల రాగాలలో,
గలగలా పారుతున్న సెలయర్లలో.....

వింతలు చూపే ఈ ప్రపంచం,
ఎవరికోసం?
వేచి చూస్తుంది నీ కోసం....

నా కుటుంబం


పెళ్ళి తరువాత జీవితం బహు విచిత్రం!!
మునుపటి బంధం అవుతుంది దూరం.
తెలియని జనం అవుతారు స్వ జనం.

కాని రక్తసంభంధం ఎప్పటికీ ఒక వరం!!
మన కష్టం,నష్టం,సుఖం,సంతోషం,
వారిని చేస్తుంది ప్రభావితం.

నాన్న తన కష్టాన్ని పోగుచేసి,
అమ్మ తన జీవితాన్ని ధారపోసి,
ప్రసాదించారు నాకు జీవితం.
అక్కా,అన్నా పంచారు వారి ప్రేమ అమితం.

నా కుటుంబం ఎప్పటికీ నాకు కొండంత బలం.

Wednesday, March 25, 2009

రీసిషనా... మజాకా...


రేపంటే భయం ఈ రోజు కొంచెం నయం.
పని భారం ఎల్లప్పుడు గరం గరం.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ఒక వరం.
ఒకప్పుడు దానిని వదిలినవారు చేశారేమో నేరం?

నిద్రలు లేవు,పనితో బేరాలు లేవు.
చెయ్యు...అనటమే ఆలస్యం....
బరిలో దూకేయటం.

కష్టపడితేనే జీతం.
సత్తా చూపిస్తేనే ఉద్యోగం.
జీతం,ఉద్యోగమే అయ్యింది జీవితం.
నేటి యువతకు లేదు వేరే ప్రపంచం.
ఇలా ఇంకా ఎంత కాలం??????

Monday, March 23, 2009

ఎవరీ భగవంతుడు????????

చాలా కాలం గమనించా..
భగవంతుడు ఉన్నడా అని అన్వేషించా..
అనుకున్నది ఒకటి
జనులనుండి విన్నవి కోటి.

భక్తి ముసుగులో జరుగుతుంది వ్యాపారం.
దేవుడిని నిజంగా చూశారా జనం?
అయినా ఉన్నాడనే నమ్మకం అపారం.
ఎందుకు వాడిపై అందరికీ మమకారం?
అని ఆలోచిస్తే తెలిసిందొక విషయం!!!!

భగవంతుడనేది ఒక "నమ్మకం".
భాధల సుడిగాలిలో ఒక వరం
అందుకే పెరుగుతుందేమో మన మనోబలం

Sunday, March 15, 2009

అమ్మమ్మ జీవితం


పిన్న వయస్సులో ఎనలేని బాధ్యతలు మోసి,
అందరికీ అండగా నిలిచి,
కురిపిస్తుంది ప్రేమ వాన,
అమ్మాన్నాన్నల ముద్దుల కూన.

తల్లిదండ్రుల సుశ్రూష చేస్తూ,
అక్కల శ్రేయస్సు కోరుతూ.
పిల్లల మంచి చెడ్డలు చూస్తూ,
వారిని ప్రయోజకులను చేస్తూ.
కుతురిని,కోడళ్ళను సమానంగా చూస్తూ,
వారికి అండగా నిలుస్తూ.
మనుమలకు ప్రేమ వాత్సల్యం పంచుతూ,
కరుగుతున్న కొవ్వోత్తిలా అందరికీ వెలుగునిస్తూ.
ఎనలేని కష్టాలకు ఎదురీదుతూ,
ఒక్కతే అందరి జీవననావను నడుపుతూ.
చేరుకుంది ఒడ్డుకి,ఆనందాల గట్టుకి.

తుఫానొకటి చెలరేగింది,
తిరిగి తనను నౌకలోకి చేర్చింది.
భగవంతుడే సారథిగా,
తాను ఒంటరి బాటసారిగా,
చేస్తుంది పయణం,
అందరికీ చేస్తుంది తనకు మించిన సహాయం.

కొద్దిపాటి ఆదరణకే ధారపోస్తుంది జీవితం,
ప్రేమకై పరితపిస్తుంది అనునిత్యం.
ఇదే మా అమ్మమ్మ జీవితం,
సుఖదుఃఖాల సమ్మేళనం.
ఆందరికీ తన జీవితం ఆదర్శప్రాయం.

Saturday, March 14, 2009

అదుపుతప్పిన జీవితాలు

జీవిస్తున్నారనే మాటేకాని వారిలో జీవం లేదు.
ఏది చేసినా మనస్సులో భావం లేదు.
కెరటాలకు ఎదురీదే శక్తి లేదు.
ఎందుకు జీవిస్తున్నారో తెలియటంలేదు.

ఏదో సాధించాలనిపిస్తుంది.
అనిపిస్తే ఏమి లాభం కలుగుతుంది?
కార్యరూపం దాల్చటం ముఖ్యం
అది వారితొ కావటంలేదు సఖ్యం.

ఎడారిలో పయణంగా మారింది జీవితం.
ఎండమావికై పరుగులో చేజారుస్తున్నారు అమితం.
దగ్గరగా ఉన్నవి కంటికి ఆనటం లేదు.
లేనిదానికై పాకులాటలో గమ్యం చేరటానికి లేదు.

ప్రశ్నల వలయంలో చిక్కుకుంది మనస్సు,
అవకాశాలు మళ్ళీ వస్తాయో లేవో ఎవరికి తెలుసు.
వచ్చినవాటిని కాపాడుకోండి
ప్రస్తుత మీ పరిస్థితిని తెలుసుకొండి.

Thursday, March 5, 2009

అమ్మా నాన్నల వాత్సల్యం

ఏదో చెయ్యాలనే తపన
అమ్మా నాన్నల ప్రేమ అమితంగా పొందాను కావున
వారి ఋణం తీర్చుకోవాలనే భావన
తెలుసు అది నా కల్పన
తీర్చగలను అనుకుంటే అవదా అది నా ప్రగల్భన
ప్రేమకు నేను విలువ కట్టగలనా?
అంత వాత్సల్యం వారికి ఇవ్వగలనా?
ఏమి చేసినా తీర్చాలంటే అది ఈ జన్మలో తీరేనా?

Tuesday, March 3, 2009

చిన్ననాటి నా స్నేహం 'లావణ్య'

నీ చిలిపి హాస్యం,
రాబోయే రోజులపై నీ జోస్యం.
నీ నడకలోని వయ్యారం,
ప్రేమ కోసం నీ నిరంతర నిరీక్షణం.

చదువు పై నీ మనసులోని గౌరవం,
తెలుగు భాషలో నీ కవితాహ్రుదయం.
బడిలో నీ స్నేహపూర్వక అనునయం,
సంతోషం ఆగక నువ్వు పెట్టిన చుంబనం.
చిరుసమయంలో మనకు ఏర్పడిన స్నేహం,
నాకు ఇప్పటికీ జ్ఞాపకం.

ఎందుకో ? కొన్ని రోజులకు అయ్యింది దూరం.
ఆతరువాత తెలిసింది నీ మరణం.
చాలా కాలం నాకు కలుగలేదు నమ్మకం
ఇప్పటికీ నువ్వు ఎక్కడో ఉన్నావనే మొండితనం
రావా! వచ్చి చూపించవా నీ లావణ్యం

కష్టజీవి
















మండుటెండలో పనుల హూరు,
లేచిన మొదలు జీవన పోరాటం షురు.
ఎండనక,వాననక,
చేస్తూనే ఉంటారు జీవించాలి కనుక.
తినటానికి తిండి లేదు,
దరి చేరే గమ్యం అంతకన్నా లేదు.
బ్రతకటం మాత్రమే వారికి తెలుసు,
కాని వారి జీవితం అందరికి అయింది అలుసు.

Monday, March 2, 2009

జీవితం






















చిగురించిన ఆశ ఎండక మానదు.
చెలరేగిన స్వరం కరగక తప్పదు.
చేస్తున్నది ఒప్పుఅనిపించిన క్షణం.
కాదు! అని నిరూపించే జనం.

మనస్సుని కదిలించి కుదిపేస్తే,
నాపై నాకే జాలి కలిగిస్తే,
బ్రతుకంటే ఏమిటో ? ఏందుకో? అనే అలజడిలో,
ఆలోచించిన ప్రతిసారి
అర్థం కాని సుడిలో, ప్రవహించే జీవనదిలో,
భాషకు అందని భావనలో,
కొట్టుకుపోతున్నానేమో మరి????

భగవంతుడా! కాపాడు అందామా, ఉన్నాడో లేడో తెలియని మధన.
నాపై నాకు లేని నమ్మకం,
కలిగిస్తుందా వాడిపై విశ్వాసం?

ప్రేమ అల వచ్చిందనే సంతోషం.
తిరిగి వెళ్ళిందనే బాధ.
రెండింటి మద్యలో ఒక నిశ్శబ్దం.
తిరిగి వస్తుందనే నమ్మకం.
ఇలా మనసుకి ఊరట కలిగించటం.
అయిపోయిందెమో నా జీవితం?

కానీ కలహం మరచి ప్రణయం
పెరిగేందుకు పడుతుంది సమయం.
అప్పుడు మదిలో మెదిలే మోహం, 
ఈ ఆలోచనలన్నింటినీ కరిగించి
చేస్తుంది కడు దూరం.
ఆ క్షణం అనిపిస్తుంది జీవితం బహు అమోఘం.