Monday, March 2, 2009

జీవితం






















చిగురించిన ఆశ ఎండక మానదు.
చెలరేగిన స్వరం కరగక తప్పదు.
చేస్తున్నది ఒప్పుఅనిపించిన క్షణం.
కాదు! అని నిరూపించే జనం.

మనస్సుని కదిలించి కుదిపేస్తే,
నాపై నాకే జాలి కలిగిస్తే,
బ్రతుకంటే ఏమిటో ? ఏందుకో? అనే అలజడిలో,
ఆలోచించిన ప్రతిసారి
అర్థం కాని సుడిలో, ప్రవహించే జీవనదిలో,
భాషకు అందని భావనలో,
కొట్టుకుపోతున్నానేమో మరి????

భగవంతుడా! కాపాడు అందామా, ఉన్నాడో లేడో తెలియని మధన.
నాపై నాకు లేని నమ్మకం,
కలిగిస్తుందా వాడిపై విశ్వాసం?

ప్రేమ అల వచ్చిందనే సంతోషం.
తిరిగి వెళ్ళిందనే బాధ.
రెండింటి మద్యలో ఒక నిశ్శబ్దం.
తిరిగి వస్తుందనే నమ్మకం.
ఇలా మనసుకి ఊరట కలిగించటం.
అయిపోయిందెమో నా జీవితం?

కానీ కలహం మరచి ప్రణయం
పెరిగేందుకు పడుతుంది సమయం.
అప్పుడు మదిలో మెదిలే మోహం, 
ఈ ఆలోచనలన్నింటినీ కరిగించి
చేస్తుంది కడు దూరం.
ఆ క్షణం అనిపిస్తుంది జీవితం బహు అమోఘం.

No comments:

Post a Comment