
నువ్వు వస్తావని నా జీవితాన్ని మారుస్తావని
నాలో నూతన శక్తి నీతో మొదలవుతుందని
నీ నవ్వే నాకు ప్రపంచాన్ని జయించిన భావన కలిగిస్తుందని
నీ బుడి బుడి అడుగులు నా జీవన బాట నిర్మిస్తాయని
నా ప్రపంచాన్ని అందంగా ,ఆనందాల బృందావనంగా మారుస్తుందని
ఆశగా ఎదురు చూస్తున్నా నీ రాకకై .........
నాలో పెరుగుతున్న ఓ అమ్మనై........ నా పసిపాపకై..........